లేటెస్ట్ బజ్ : వకీల్ సాబ్ టీజర్ వచ్చేది అప్పుడే.!

Wednesday, July 29th, 2020, 05:35:15 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ”వకీల్ సాబ్”. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలను నెలకొల్పుకుంది. ఒక రీమేక్ సినిమా అయినప్పటికీ పవన్ నుంచి రీఎంట్రీ సినిమా కావడంతో అన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఫస్ట్ సింగిల్ పాట మాత్రమే ఇచ్చారు.

అలాగే ఎప్పుడో మే నెల లోనే సినిమా విడుదల కావాల్సిన ఈ చిత్రం ఊహించని విధంగా కరోనా ఎంటర్ కావడంతో ఆగిపోవాల్సి వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీనితో పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఓ ఫస్ట్ లుక్ కానీ టీజర్ కోసం కానీ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం నుంచి టీజర్ రాబోతుందట వచ్చే సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా టీజర్ ను విడుడల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. దాదాపు అయితే ఆ రోజు కన్ఫర్మే అని తెలుస్తుంది. మరి ఏం జరగనుందో చూడాలి.