తాను ఆ వేధింపులకు గురయ్యానంటున్న పవన్ హీరోయిన్ ?

Thursday, October 19th, 2017, 12:55:51 PM IST

ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్ తమ ఫీలింగ్స్ ని బహిర్గత పరుస్తున్నారు. మొదట్లో పెద్దగా ఈ తరహా విషయాలు పట్టించుకోని హీరోయిన్స్ ఇప్పుడు బాహాటంగానే తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కొందరైతే తమపై లైంగిక వేధింపులు జరిగాయని చెప్పి సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరింది మరో అందాల భామ కృతి కర్బందా ? పవన్ కళ్యాణ్ తో తీన్మార్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఆ తరువాత అవకాశాలు వచ్చాయి కానీ కమర్షియల్ గా పెద్దగా విజయాన్ని అందుకోలేకపోవడంతో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం సౌత్ లో అవకాశాలు లేని ఈ భామ తాజాగా ఓ సందర్బంగా తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను .. వెరీ సాడ్ అని చెప్పింది. సినిమాల్లో హీరోయిన్స్ గా ఎదగాలంటే ఇలాంటివి తప్పదని చెబుతున్నారు . తాజాగా కృతి కర్బందా చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.