కొరటాల శివ మరో ప్లాన్… వర్కౌట్ అయ్యేనా?

Thursday, October 15th, 2020, 09:50:15 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ఆచార్య చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం అనంతరం కొరటాల శివ అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ చిత్రానికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటం, అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండటం తో కొరటాల శివ మరొక ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రం తో చిన్న సినిమాల్లో సాలిడ్ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి తో ఒక సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక చిన్న సినిమా, అది కూడా లవ్ స్టోరీ అయితేనే బావుంటుంది అని కొరటాల శివ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ కొరటాల శివ బడా హీరోలతో తప్ప, చిన్న హీరోలతో సినిమా చేసిన దాఖలాలు లేవు. అయితే ఈ ఆసక్తికర ప్రాజెక్ట్ సెట్స్ పై కి వెళ్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.