హైదరాబాద్ లో ఘనంగా కొణిదెల నీహారిక నిశ్చితార్థం

Thursday, August 13th, 2020, 10:22:56 PM IST


అనుకున్న రోజునే కొణిదెల నీహారిక – చైతన్య జొన్నలగడ్డ ల నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ లోని అందరూ హజరు అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి మరియు నాగబాబు కుటుంబ సభ్యులు అందరూ హజరు కాగా, రామ్ చరణ్ సైతం కుటుంబ సమేతంగా హజరు అయ్యారు. ఈ వేడుక లో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా వేడుక లో అలరించారు. అయితే ఈ వేడుక లో అందరూ కూడా కరోనా వైరస్ నిబంధనలు పాటించినట్లు తెలుస్తోంది.

అందరూ మాస్క్ లతో కనిపించగా, ఫోటోలు దిగే సమయం లో వాటిని తొలగించారు. అయితే మెగా ఫ్యామిలీ కుటుంబ సమేతంగా ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అభిమానులు సైతం తెగ షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే చైతన్య జొన్నలగడ్డ గుంటూరు జిల్లా ఐజీ అయిన ప్రభాకర్ కుమారుడు. ఇతను ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా పని చేస్తున్నారు. అయితే వరుణ్ తేజ్ తన బావ కి ఫ్యామిలీ లోకి వెల్ కమ్ అంటూ సోషల్ మీడియా ద్వారా ఆహ్వానం పలికారు.