ఈ స్టార్ హీరోయిన్ కూడా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ లా ఉండిపోద్ది.!

Saturday, August 1st, 2020, 05:36:21 PM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం “భరత్ అనే నేను” చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయిన హీరోయిన్ కియారా అద్వానీ. మొదటి సినిమాతోనే మంచి మార్కులు అందుకున్న ఈమె తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

అయితే నిన్ననే ఆమె పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సహా ఇతర సెలెబ్రెటీలు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పటికే 28 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ హాట్ హీరోయిన్ తన వివాహం కోసం కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను ఏది ఏమైనప్పటికీ మాత్రం ప్రేమ పెళ్లి మాత్రమే చేసుకుంటానని చెప్పేసింది.

అయితే తన తల్లిదండ్రులది ప్రేమ వివాహమే అని కానీ వారు ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారట. అలాగే తాను కూడా కనీసం ఏడేళ్లు ఒకరిని అర్ధం చేసుకొని పెళ్లి చేసుకున్నాక పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. అంటే ఇక్కడ నుంచి ఇంకో ఏడేళ్లు అంటే 35 పైమాటే సో అప్పటి వరకు ఈ అమ్మడు కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హీరోయిన్స్ జాబితా లోకి వెళ్లిపోవడం ఖాయం అని చెప్పాలి.