ఫాస్టెస్ట్ 2 మిలియన్స్ లైక్స్ సాధించిన కేజీఎఫ్ 2 టీజర్!

Friday, January 8th, 2021, 08:30:55 AM IST

కేజీఫ్ చాప్టర్ 1 కి కొనసాగింపు గా వస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ నిన్న రాత్రి విడుదల అయింది. అయితే ఇప్పటి వరకూ లేని రికార్డ్ ను ఈ టీజర్ సొంత చేసుకుంటుంది. ఇండియా లోనే ఫాస్టెస్ట్ 2 మిలియన్స్ లైక్స్ సాధించిన టీజర్ గా నిలిచింది. ఈ చిత్రం టీజర్ విడుదల అనంతరం నుండి అభిమానులు టీజర్ పై దండయాత్ర చేశారు. పది గంటల ముప్పై నిమిషాలకే ఈ టీజర్ రెండు మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకోగా, కోటి యాభై లక్షల మంది టీజర్ ను చూశారు.

మొదటి చాప్టర్ భారీ విజయం సాధించడంతో అందుకు తగ్గట్లుగా, భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టీజర్ లో మాస్ ఎలివేషన్స్ హైలెట్ గా ఉన్నాయి. ప్రతి పాత్ర ను కూడా ఎంతో పవర్ఫుల్ గా తీర్చి దిద్దారు ప్రశాంత్ నీల్. హీరో యశ్ రాకీ భాయ్ పాత్ర లో ఇంకా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. టీజర్ లో వచ్చే డైలాగ్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. చరిత్ర మనకు చెప్పింది, శక్తివంతమైన వారు శకివంతమైన ప్రాంతాల నుండి వస్తారు అని, కానీ చరిత్ర తప్పు చెప్పింది. శక్తివంతమైన వారు ప్రాంతాలను మరింత శక్తివంతంగా చేస్తారు అంటూ వచ్చే డైలాగు కి, ఎలివేషన్ కి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. యశ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన ఈ టీజర్ కి ప్రేక్షకులు సర్వత్రా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.