కేజీఎఫ్ చిత్ర యూనిట్ కి ఇది గట్టి దెబ్బే నా!?

Thursday, August 13th, 2020, 02:08:02 AM IST

దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, విలన్ అధీరా లుక్ ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రం లో మేజర్ పార్ట్ ఇంకా పెండింగ్ లో ఉంది. అయితే విలన్ అదేరా కి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా ఇంకా జరగాల్సి ఉంది. అయితే ఈ క్లిష్ట సమయంలో ఆధీరా పాత్ర పోషిస్తున్న సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. స్టేజ్ 3 అని వైద్యులు నిర్ధారించారు.

అయితే చికిత్స నిమిత్తము యూ ఎస్ కి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇప్పటి ఈ చిత్ర షూటింగ్ చాలా స్లో గా అవుతుండటం తో చిత్ర యూనిట్ కీలక పార్ట్ ను పూర్తి చేయాలని భావించింది. ఈ లోగా సంజయ్ కి ఇలా జరగడం తో చిత్ర యూనిట్ డైలమా లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కి విడుదల చేయాలని బావించిన చిత్ర యూనిట్ కి ఇది గట్టి దెబ్బే అని చెప్పాలి.