న్యూక్లియర్ ప్లాంట్ అంటూ ఎన్టీఆర్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసిన కేజిఎఫ్ దర్శకుడు!

Wednesday, May 20th, 2020, 02:44:49 PM IST

టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. అయితే సౌత్ నాట ప్రభంజనం సృష్టించిన కేజీ ఎఫ్ చిత్ర దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఫైనల్ గా నాకు తెలిసింది అని ప్రశాంత్ నీల్ వ్యాఖ్యానించారు.నీ చుట్టూ ఉండే క్రేజీ ఎనర్జీ కి నెక్స్ట్ టైమ్ నా రేడియేషన్ సూట్ తీసుకొస్తా అని వ్యాఖ్యానించారు. హ్యాపీ బర్త్ డే బ్రదర్ అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యల పై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేసేందుకు కూడా సిద్దం అయ్యారు. అయితే కేజీ ఎఫ్ చిత్రం తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం దాని సీక్వెల్ పై ఫోకస్ పెట్టారు. అయితే ఈ చిత్రం అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రశాంత్ నీల్ చేసిన వ్యాఖ్యలు సైతం ఈ పుకారు కు మరింత బలాన్ని కలిగిస్తున్నాయి.