కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ మళ్లీ మొదలయ్యేది అప్పటి నుండే!

Thursday, August 6th, 2020, 02:12:56 AM IST


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అయిన సంగతి తెలిసిందే. అన్ లాక్ మొదలైనప్పటి బడా బడా సినిమాల చిత్రీకరణ కి ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. అయితే సౌత్ ఇండియా లో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న కేజిఎఫ్ చాప్టర్ 1 కి కొనసాగింపుగా వస్తున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ ను పునః ప్రారంభించెందుకు సిద్దం గా ఉంది.

కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ ఆగస్ట్ 15 వ తేదీ నుండి షూటింగ్ మళ్లీ మొదలు కానుంది. బెంగళూరు లోని మినర్వా మిల్స్ లో షూటింగ్ కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా తరహాలో రూపొందించడం మాత్రమే కాకుండా, అన్ని ప్రాంతాల, బషలకి చెందిన నటులను తీసుకుంటున్నారు. తెలుగు నుండి రావు రమేష ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్ర లు పోషిస్తున్నారు. కేజీ ఎఫ్ చాప్టర్ 1 తో సంచలన సృష్టించిన ప్రశాంత్ నీల్- యశ్ కాంబినేషన్ మరొకసారి మేజిక్ క్రియేట్ చేసేందుకు సిద్దం అవుతోంది.