అధీరా కంటే పదిరెట్లు పవర్ ఫుల్ గా రాకీ భాయ్!

Monday, August 17th, 2020, 09:41:36 PM IST


కేజీఎఫ్ చాప్టర్ 2 ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ విడుదల అయినప్పటి నుండి రాకీభాయ్ ను చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అధీర లుక్ ను తాజాగా విడుదల చేసిన చిత్ర యూనిట్ ఇంకా హీరో యశ్ లుక్ ను విడుదల చేయలేదు. అయితే యశ్ ఈ చిత్రం కోసం ఎంతగా కష్టపడ్డారు అనేది తాజా గరుడ పాత్ర పోషించిన రామ చంద్ర తెలిపారు.

అధిరా లుక్ దేశవ్యాప్తంగా ఎంతో హైప్ క్రియేట్ చేసింది అని అన్నారు. అయితే రాకీ లుక్ అధిరా కంటే పదిరెట్లు పవర్ ఫుల్ గా ఉంటుంది అని అన్నారు. అంతేకాక యశ్ ఈ చిత్రం కోసం తన శరీరాన్ని ఉక్కు బాడిలా మార్చుకున్నారు అని అన్నారు. కేజీ ఎఫ్ చాప్టర్ 2 కి సంబంధించిన పోస్టర్ విడుదల తర్వాత యశ్ ఎంత డెడికేటెడ్ గా ఈ చిత్రానికి పని చేశారో తెలుస్తోంది అని అన్నారు. గరుడ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమా పై అంచనాలు మరింత పెంచేలా ఉన్నాయి. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.