యశ్ కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా లెంగ్త్ ఎక్కువేనట…కారణం అదేనా?

Sunday, May 9th, 2021, 08:04:31 PM IST


రాక్ స్టార్ యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ లు గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. మొదటి పార్టీ భారీ విజయం సాధించడంతో రెండవ పార్ట్ పై మేకర్స్ ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో టాలీవుడ్, కోలీవుడ్ నుండి కూడా పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ హీరో సంజయ్ దత్ ఈ చిత్రం లో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం మరొక కీలక పాత్ర పోషించారు. అయితే ఈ చిత్రం లో భారీ తారాగణం ఉండటం తో ప్రతి ఒక్కరినీ కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ పాత్ర కు అనుగుణంగా ఉపయోగించుకున్నారు అని తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ చిత్రం కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ చిత్రం లెంగ్త్ ఎక్కువ అంటూ పలువురు చెబుతున్నారు. దాదాపు మూడు గంటల కంటే ఎక్కువగా ఈ చిత్రం నిడివి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్ట్ వన్ కి వచ్చిన ఆదరణ తో పార్ట్ ను భారీ గా తెరకెక్కిస్తున్నారు. అయితే మొదటి పార్ట్ తరహాలో సినిమా కంటెంట్ ఉంటే భారీ విజయం సాధించడం పక్కా అంటూ కొందరు అంటున్నారు.