“మిస్ ఇండియా అంటే నేను కాది అదొక బ్రాండ్” – కీర్తి సురేశ్

Saturday, October 24th, 2020, 10:14:28 PM IST

మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేశ్ ప్రస్తుతం ‘మిస్ ఇండియా’ అనే సినిమాలో మెయిన్ లీడ్‌లో నటిస్తుంది. ఈ సినిమాకు నరేంద్రనాథ్‌ దర్శకత్వం వహిస్తుండగా, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే తాజాగా దసరా సందర్భంగా సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. చిన్నతనం నుంచి బిజినెస్ చేయాలన్న ఒకే ఆశయాన్ని పెట్టుకున్న అమ్మాయిగా కీర్తి సురేశ్ పాత్ర కనిపిస్తుంది. ఈ తరుణంలో ఆమె ఎదురుకున్న ఒడిదుడుకులు, విదేశాల్లో ఇండియన్ ఛాయ్‌ని బిజినెస్‌గా పెట్టి ఎదగడం, ఈ తరుణంలో జగపతిబాబుతో వైర్యం ఎలా ఏర్పడిందన్న అంశాలు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. అయితే మిస్‌ ఇండియా అంటే నేను కాదు మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్‌ అంటూ కీర్తి చెప్పే డైలాగ్ టీజర్ మొత్తానికి హైలెట్‌గా అనిపించింది. అయితే ఈ సినిమాని ఈ సినిమాన నవంబర్ 04 న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది.