చీపురు పట్టి ఊడ్చిన కత్రినా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Friday, March 27th, 2020, 01:48:28 AM IST

దేశంలో కరోనా వైరస్ పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీనితో ఎక్కడ చూసినా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుండడంతో ప్రజలంతా ఎక్కువ మేరకు ఇళ్ళకే పరిమితం కావలసి వచ్చింది.

అయితే ఇలాంటి నేపధ్యంలో పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలు ఇంట్లోనే ఉంటూ తమ ఇంటి పనులను చేస్తూ కనిపిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తాజాగా చేత్తో చీపురు పట్టి తన ఇంట్లో ఓ గదిని శుభ్రపరిచింది. ఇకపోతే ఈ అమ్మడు మొన్న వంట గదిలో గిన్నెలు కూడా కడిగింది. ఏదేమైనా నిత్యం షూటింగ్‌లు, సినిమాలు అంటూ క్షణం తీరిక లేకుండా గడిపే సెలబ్రెటీలు ఇలా ఇంటి పనులు చేస్తుండడంతో వారి పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.