ఎంత మంచివాడవురా ముందు టైటిల్.. కళ్యాణ్ రామ్ రివీల్..!

Monday, January 13th, 2020, 08:43:47 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, మేహ్రీన్ హీరోయిన్‌గా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఎంత మంచివాడవురా. పక్కా ఫ్యామీలీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 15వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు, ట్రైలర్‌లకు మంచి టాక్ రావడంతో సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి.

అయితే ఈ సినిమా రిలీజ్‌కి రెండు రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్రబృందం జోరును పెంచింది. అందులో భాగంగానే హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ సినిమాకి ముందుగా ‘ఆల్ ఈజ్ వెల్’ అనే టైటిల్‌ను అనుకున్నారని అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైన్ సినిమా కావడంతో కాస్త తెలుగుదనంతో కూడుకున్న టైటిల్ అయితే బాగుంటుందని భావించి చివరకు ఎంత మంచివాడవురా అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలిపాడు.