అభిమానులకు షాక్ ఇచ్చిన కొత్త పెళ్ళి కూతురు కాజల్..!

Thursday, November 5th, 2020, 11:18:06 PM IST

Kajal
కొత్త పెళ్ళి కూతురు కాజల్ అగర్వాల్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇటీవలే తన స్నేహితుడితో కాజల్ వివాహం జరిగింది. అయితే ఇప్పట్లో కాజల్ షూటింగ్‌లకు వచ్చే అవకాశం లేదని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ కాజల్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ నెల 9 నుంచి ప్రారంభంకానున్న ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు కాజల్ ప్రకటించింది. అంతేకాదు తన స్నేహితులకు ఇక్కడే పార్టీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌లో మెగస్టార్ చిరంజీవి పాల్గొనేందుకు మరికొంత సమయం పట్టొచ్చు అని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మెగస్టార్ చిరంజీవి సరసన కాజల్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయబోతున్నారు.