హాట్ టాపిక్: మంచు విష్ణు కి చెల్లిగా కాజల్ అగర్వాల్

Tuesday, August 4th, 2020, 02:20:55 AM IST


టాలీవుడ్ లో ఇపుడు చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రేక్షకులను కనువిందు చేసేందుకు సిద్దం అవుతున్నాయి. అయితే మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న మోసగాళ్ళు చిత్రం కూడా ఒకటి అని చెప్పాలి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పిక్స్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ విష్ణు కి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు. నేడు విడుదల అయినా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

అయితే ఈ మోసగాళ్ళు చిత్రం యూనివర్సల్ స్టోరీ తో వస్తున్నట్లు హీరో మంచు విష్ణు తెలిపారు. అంతేకాక హాలీవుడ్ లో ఈ చిత్రం ఆకట్టుకుంటుంది అని, టాలీవుడ్ లో కూడా ఈ చిత్రం ఘన విజయం అందిస్తుందనే నమ్మకం గో ఉన్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేకాక తెలుగు నేటివిటీ కి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఈ మూవీ తనకు సూపర్ హిట్ అందిస్తోంది అని అన్నారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా మంచు విష్ణు కి సరైనా హిట్ లేదని చెప్పాలి. ఈ చిత్రానికి హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గి చిన్ దర్శకత్వం వహిస్తున్నారు.