జ్యోతిక సినిమా అప్పుడే అక్కడ “వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్” గా.!

Wednesday, June 3rd, 2020, 11:30:02 AM IST

కరోనా దెబ్బకు మీడియం బడ్జెట్ సినిమాలు చాలానే వేరే దారి లేక డిజిటిల్ గా విడుదలకు వచ్చేసాయి. అలా రాబోతున్నామని చెప్పినపుడు ఆచిత్ర యూనిట్ కు మరియు థియేటర్ యాజమాన్యాలకు పెద్ద ఎత్తునే వార్ నడిచింది.

అలా సంచలనం రేపిన చిత్రాల్లో జ్యోతిక నటించిన తాజా చిత్రం “పొన్మగళ్ వందల్” సినిమా కూడా ఒకటి. అక్కడి స్టార్ హీరో మరియు ఆమె భర్త సూర్య నిర్మించిన ఈ చిత్రం అనేక అడ్డంకుల నడుమ అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

జెజె ఫ్రెడ్రిక్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే డిజిటల్ గా వచ్చినా మళ్ళీ ఈ లోపునే మలేషియాలో తమిళ్ వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా తెరకెక్కనున్నట్టు టెలికాస్ట్ కానున్నట్టు తెలుస్తుంది.ఆస్ట్రో ఫైట్ అనే ఛానెల్లో ఈ చిత్రం అతి త్వరలోనే టెలికాస్ట్ కానున్నట్టు ఇప్పుడు సమాచారం.