కసి మీద ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్…భారీ ఆల్ టైమ్ రికార్డు సెట్ చేశారు గా!

Thursday, May 21st, 2020, 03:10:27 PM IST


ఎన్టీఆర్ అభిమానులు రౌద్రం రణం రుధిరం చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కి సంబంధించిన ఎటువంటి విడియో లేదా ఫస్ట్ లుక్ ఈ చిత్రం నుండి విడుదల కాలేదు. మొదటినుండి ఎన్టీఆర్ పుట్టిన రోజున వీడియో వస్తుంది అని అభిమానులు భావించారు. అయితే రాజమౌళి కూడా అభిమానులకు మొండి చేయి చూపించారు. అయితేనేం అభిమానులు మొత్తానికి ఒక భారీ ఆల్ టైమ్ రికార్డు ను సెట్ చేశారు.

ప్రస్తుతం అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంది అనేది సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండేవారి ద్వారా తెలుస్తోంది. ఏదైనా ట్రెండ్ ఇక్కడి నుండే మొదలవుతుంది. అయితే #happybirthdayNTR అనే హాష్ ట్యాగ్ తో అభిమానులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ హాష్ ట్యాగ్ ను దాదాపు 21.5 మిలియన్ మంది ట్వీట్ చేసారు. అయితే ఇది ఆల్ టైమ్ ఇండియా రికార్డ్ అని తెలుస్తోంది. ఇప్పటివరకు ఒక హాష్ ట్యాగ్ తో 24 గంటల్లో ఎక్కువగా ట్వీట్ చేసింది ఇదే కావడం విశేషం. అయితే ఎన్టీఆర్ అభిమానులు కొమరం భీమ్ లుక్ ను చూడలేక పోవడం, దాని పై మరింత కసితో ఎన్టీఆర్ కి ఎక్కువ మంది సోషల్ మీడియా ద్వారా విషెష్ తెలియజేశారు.