లేటెస్ట్ అప్డేట్: ఎన్టీఆర్ అభిమానులు ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందేనా!?

Monday, August 31st, 2020, 05:30:46 PM IST

NTR_Trivikram

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా రోజుల నుండి ఎన్టీఆర్ 30 మూవీ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్క బోయే ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అరవింద సమేత వీర రాఘవ రెడ్డి చిత్రం తర్వాత మళ్లీ వీరు సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి ఇన్ని రోజులు అయినా, ఇంకా టైటిల్ ను మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ఇవ్వాలి అంటూ అభిమానులు భారీగా చిత్ర యూనిట్ కి మెసేజెస్ చేస్తూ ఉండటం తో చిత్రానికి సంబంధించిన ఒక నిర్మాత స్పందించారు.

తారక్ అభిమానులకు తెలియ జేయునది ఏమనగా, మీ నుండి వస్తున్న సందేశాలను చూస్తున్నాం, ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత విడుదల చేస్తాం. మాకు ఒక సెంటిమెంట్ ఉంది, టైటిల్ ను రీవీల్ చేయకూడదు అని, అయితే త్వరలో బిగ్ అప్డేట్ ను మీ ముందుకు తీసుకు వస్తాం అని అభిమానులకు నిర్మాత నాగ వంశీ హామీ ఇచ్చారు.

అయితే ఇప్పటికే రౌద్రం రణం రుదిరం చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. రామ్ చరణ్ కూడా ఈ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలు కానుంది. అయితే ఈ చిత్ర షూటింగ్ అనంతరం ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం లో నటించనున్నారు. అంటే ఇంకా కొన్ని రోజుల పాటు అభిమానులు వేచి ఉండక తప్పదు అని తెలుస్తుంది.