వకీల్ సాబ్ కి అనుమతి లేదు..!

Wednesday, March 31st, 2021, 08:56:06 AM IST

పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9 వ తేదీన విడుదల కానుంది. అయితే ఏప్రిల్ మూడవ తేదీన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే యూసఫ్ గూడా పోలీస్ లైన్స్ లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్ లో తలపెట్టిన ఈ ఈవెంట్ కు జూబ్లీ హిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే వేణు శ్రీరామ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జే.మీడియా ఫ్యాక్టరీ నిర్వహించాలని పోలీసులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.అయితే కరోనా వైరస్ మహమ్మారి రాష్ట్రం లో ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఇంకా మరింత ఎక్కువ మందికి కరోనా సోకే అవకాశం ఉందని నిరాకరించినట్లు తెలుస్తోంది.

అంతేకాక సభలకు, సమావేశాలకు, మీటింగ్ లకు అనుమతులు లేవు అని ఇటీవల చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా జీఓ ప్రకారం ఈవెంట్ కు అనుమతి నిరాకరించారు. అయితే ఈ ఈవెంట్ కు కనీసం ఐదు నుండి ఆరు వేల మంది హాజరు కానున్నారు అని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.