తారక్ పాటకు దుమ్ము రేపిన జపాన్ దంపతులు..!

Saturday, July 4th, 2020, 06:05:55 PM IST

మన మన టాలీవుడ్ లో మంచి మాస్ క్రౌడ్ పుల్లింగ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు అయితే ఎన్టీఆర్ ఒక అద్భుతమైన నటుడిగానే కాకుండా అంతే స్థాయి అద్భుతమైన డాన్సర్ అని అన్న సంగతి అందరికీ తెలిసిందే తన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో సినిమాల పరంగా కొన్ని ఫెయిల్ అయినా తారక్ డాన్స్ లు మాత్రం ఎప్పుడు నిరాశ పరిచ లేదు.

అయితే తారక్ డాన్సులకు కేవలం మన దగ్గర మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఆ విషయం దర్శకుడు సుకుమార్ తో నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్న సమయంలో తెలిసింది జపాన్లో తారక్ డాన్స్ లు అంటే స్పెషల్ క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు అదే జపాన్ కు చెందిన ఓ జంట తారక్ మరియు సమీరా రెడ్డి నటించిన ఓ చిత్రంలోని మాస్ సాంగ్ కు ఓ జంట చేసిన డ్యూయెట్ డాన్స్ ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా మారింది.

ఈ జపాన్ జంట చేసిన డాన్స్ చూస్తే మాత్రం మాములు రేంజ్ లో లేదని చెప్పాలి. ఒకే రంగు కాస్ట్యూమ్స్ ఏమాత్రం ఫ్లో తగ్గని డాన్స్ మూమెంట్స్ ఈ జంట దుమ్ము రేపేసారు. ఆ వీడియోను కనుక ఇంకా చూడనట్టైతే ఇక్కడ చూసేయ్యండి.