మలయాళంలో ఎన్టీఆర్ క్రేజ్ మాములుగా లేదుగా ?

Saturday, August 20th, 2016, 09:49:56 AM IST


ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ”జనతా గ్యారేజ్” సినిమా వచ్చే నెల 2 న విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తున్న ఈ సినిమా మలయాళంలో కూడా విడుదలవుంది. మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కేరళ లో కూడా భారీ బిజినెస్ జరిగింది. ఇప్పటికే మలయాళ స్ట్రైట్ సినిమా కానీ చిత్రానికి ఇంత భారీ క్రేజ్ ఎప్పుడు రాలేదు. ముక్యంగా అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా విడుదలవాదం సంచలనం రేపుతోంది. మొత్తానికి ఈ సినిమాతో కేరళలో ఎన్టీఆర్ క్రేజ్ బాగానే ఉంది మరి !!