హాట్ టాపిక్: అదే ఆమెతో నాకున్న అఫైర్ – జగపతి బాబు

Sunday, April 5th, 2020, 03:30:44 PM IST


విలక్షణ నటుడు జగపతి బాబు తన అఫైర్ గురించి మాట్లాడారు. అలనాటి అందాల తార సౌందర్య తో తనకు అఫైర్ ఉండేదని తెలిపారు. అవును సౌందర్య తో నాకు అఫైర్ ఉండేది అని, ఆమె సోదరుడు నాకు చాలా క్లోజ్ అని జగపతి బాబు అన్నారు. అందుకే తరచూ వారి ఇంటికి వెళ్ళేవాడిని అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సౌందర్య మా ఇంటికి తరచుగా వచ్చేది అని అన్నారు. అయితే ఆమె గురించి అందరూ తప్పుగా అనుకొనే వారు, కని సౌందర్య అలాంటిది కాదు అని అన్నారు. అంతేకాకుండా ప్రజలందరూ తమ బంధాన్ని తప్పుగా అర్ధం చేసుకొనే వారు అని వ్యాఖ్యానించారు. అయితే మా బంధం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే దానిని కాంప్లిమెంట్స్ గానే తీసుకుంటా అని అన్నారు.

అసలు ఈ విషయంలో దాచాల్సింది ఏమీ లేదని జగపతి బాబు అన్నారు. అయితే తమ పై వచ్చే రుమర్లని కాంప్లిమెంట్స్ గా తీసు కుంటా అని వ్యాఖ్యానించారు. అయితే అందరు దృష్టిలో అఫైర్ అంటే లైంగిక సంబంధం కలిగి ఉండటం అని అనుకుంటారు, కానీ, సౌందర్య నేను మంచి అనుబంధాన్ని కలిగి ఉండేవాళ్ళం అని అన్నారు. అదే ఆమెతో నాకున్న అఫైర్ అని జగపతి బాబు అన్నారు. వీరిద్దరి కలయికలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అయితే జగపతి బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో కీలక పాత్రలు పోషిస్తూ, టాలీవుడ్ నటులలో చాలా గుర్తింపు తెచ్చుకున్నారు.