పవన్ సినిమా లో సెకండ్ హీరోయిన్ గా శ్రీలంక బ్యూటీ?

Thursday, February 4th, 2021, 09:31:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమా లు చేస్తూ బిజీ గా ఉన్నారు. అటు క్రియాశీల రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూనే, ఇటు వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రాన్ని పూర్తి చేశారు. అయ్యప్పనుం కోశియం చిత్రం లో ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ చిత్రం లో రానా దగ్గుపాటి కూడా కీలక పాత్ర లో నటిస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా శ్రీలంక కి చెందిన బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ బ్యూటీ ను సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే సాహో లో బ్యాడ్ బాయ్ పాట తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఈ బ్యూటీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజం అయితే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి ఒక తెలుగు లో వరుస అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.