జాను క్లోజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్.. డిజాస్టర్ టాక్..!

Saturday, February 22nd, 2020, 12:03:38 AM IST

శర్వానంద్ హీరోగా, అక్కినేని సమంత హీరోయిన్‌గా సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఈ నెల 7 వ తేదిన జాను సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్‌లో మంచి హిట్ టాక్ సంపాదించుకున్న 96 సినిమాని రీమేక్ చేసి జానుగా తెరకెక్కించిన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సమంత, శర్వానంద్ నటన, ఈ సినిమా ప్రేక్షకులకు కలిగించిన ఫీల్ చూశాక ఖచ్చితంగా మంచి కలెక్షన్లనే రాబడుతుందని అనుకున్న చిత్ర బృందానికి డిజాస్టర్ నష్టాన్ని మిగిల్చిందని సమాచారం.

అయితే మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ లభించిన ఈ సినిమాకు మూడు రోజులు కలెక్షన్లు బాగానే వచ్చినా నాలుగో రోజు నుంచి కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయి. నైజాం 2.89 కోట్లు, సీడెడ్ 0.89 కోట్లు, ఈస్ట్ 0.49 కోట్లు, వెస్ట్ 0.38 కోట్లు, ఉత్తరాంధ్ర 1.19 కోట్లు, కృష్ణా 0.52 కోట్లు, గుంటూరు 0.62 కోట్లు, నెల్లూరు 0.23 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 0.45 కోట్లు రాబట్టగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 8.54 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ కలెక్షన్లను చూసుకున్నట్టయితే దాదాపు ఈ సినిమా 12.46 కోట్ల మేర నష్టాన్ని మిగిల్చి భారీ డిజాస్టర్‌నే మూటగట్టుకుందట.