పూరి – విజయ్ కాంబో లో వస్తున్న చిత్రానికి టైటిల్ ఇదేనా?

Thursday, May 21st, 2020, 11:20:05 PM IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఫైటర్ అంటూ వర్కింగ్ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక విషయం ఇపుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లో, సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతుంది. లయన్ కి మరియు టైగర్ కి క్రాస్ బ్రీడింగ్ అయిన లైగర్ అనే టైటిల్ ను ఈ చిత్రానికి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ పై ఇప్పటికే చాలా పుకార్లు వచ్చిన పూరి జగన్నాథ్ మాత్రం ఈ టైటిల్ పై ఆసక్తి చూపుతునట్లు తెలుస్తోంది.

అయితే ఈ చిత్రం లో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ చిత్రం పై భారీ ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ ఇస్మార్టు శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుం డటం తో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాక ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ సినిమా గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.