ఈ ఇద్దరు స్టార్ హీరోలతో తమన్నా షో కన్ఫార్మా.?

Wednesday, July 1st, 2020, 04:54:01 PM IST

ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ యాప్స్ వాడకం ఇపుడు తారా స్థాయికి చేరుకుంది. సరికొత్త ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ డిజిటల్ యాప్స్ ఎంతో ప్రాముఖ్యత ను సంతరించుకున్నాయి. కానీ ఇవన్నీ కేవలం జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. తప్ప మన రీజనల్ గా ఏమి లేవు.

కానీ ఆ లోటును భర్తీ చేస్తూ టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ స్టార్ట్ చేసిన స్ట్రీమింగ్ యాప్ “ఆహా”. ఇది ఇది మార్కెట్లోకి వచ్చిన కొత్తలోనే మంచి ఆదరణను సంతరించుకుంది కానీ దీనికి మరింత పాపులారిటీ కావలసి వచ్చింది అందులో భాగంగా ఈ యాప్ ద్వారా స్టార్ హీరోయిన్ తమన్నాకు భారీ రెమ్యునరేషన్ చెల్లించి ఒక సోను ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి.

అయితే ఇది యాప్ లో ప్లాన్ చేసిన ఈ షోకు మొట్ట మొదటి ఎపిసోడ్ లో తమన్నా మెగా పవర్ స్టార్ రాంచరణ్ అలాగే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ లతో కలిసి కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలతో తమన్నా ప్రోగ్రాం కన్ఫార్మా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.