సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నారా?

Wednesday, August 12th, 2020, 02:08:06 AM IST


బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఇటీవల ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఊపిరతిత్తులకు సంబంధించి, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు తలెత్తడం తో సంజయ్ చికిత్స తీసుకున్నారు. అయితే తన ఆరోగ్యం కి సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంజయ్ తన అభిమానులకు తెలియజేశారు.

అయితే సంజయ్ దత్ ప్రస్తుతం ఊపిరితిత్తులకి సంబంధించిన క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు అతని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అంతేకాక క్యాన్సర్ మూడవ స్టేజ్ లో ఉందని చెబుతున్నారు. అయితే ఇదే విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే యూ ఎస్ వెళ్లి చికిత్స తీసుకుంటా అని చెప్పిన సంజయ్ ఇపుడు ఇలాంటి వార్తలు రావడంతో అభిమానులు మరింత ఆందోళన కి గురి అయ్యే అవకాశం ఉంది. సంజయ్ నటించిన సడక్ 2 ఈ నెల 28 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కి సిద్దంగా ఉండగా, క్రేజీ ప్రాజెక్ట్ కేజీ ఎఫ్ చాప్టర్ 2 లో ఇంకా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది.