రామ్ గోపాల్ వర్మ కి కరోనా…అసలు మ్యాటర్ ఇదే!

Tuesday, August 11th, 2020, 10:43:57 PM IST


వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ అడ్డంగా దొరికిపోయారు. తనకి కరోనా వైరస్ లేదు అని సోషల్ మీడియా ద్వారా ఇది వరకే వెల్లడించారు. తన డంబెల్ తో ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియో ను పెట్టి మరి నాకు కరోనా వైరస్ లేదు అని తెలిపారు రామ్ గోపాల్ వర్మ. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ కోర్టు వ్యవహారం లో అడ్డంగా దొరికిపోయారు. వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న మర్డర్ చిత్రం కి సంబంధించి అమృత ప్రణయ్ కోర్టు కెక్కిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే మర్డర్ చిత్రానికి సంబదించి అఫి డవిట్ ను దాఖలు చేయాల్సిందిగా రామ్ గోపాల్ వర్మ ను కోర్టు కోరిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రామ్ గోపాల్ వర్మ తరపున న్యాయవాది వర్మ కి కరోనా సోకడం చేత అఫిడవిట్ పై సంతకం చేయడం కుదరలేదు అని తేల్చి చెప్పారు. అందుచేత విచారణ ను వాయిదా వేయమని కోరగా కోర్టు సైతం ఈ నెల ఆగస్ట్ 14 కి విచారణ వాయిదా వేయడం జరిగింది. అయితే అమృత ప్రణయ్ ఈ విషయం లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు కి తప్పుడు సమాచారం ఇచ్చారు అని అన్నారు. ఇదివరకే రామ్ గోపాల్ వర్మ తనకు కరోనా లేదు అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వాస్తవాలను కోర్టు దృష్టికి తీసుకెళ్తా మని అమృత ప్రణయ్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. అన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండే వర్మ ఇలా దొరికిపోవడం ఆశ్చర్యం గా ఉంది.