వర్మ మెగా ఫ్యామిలీకి వీరాభిమానా.?

Sunday, August 2nd, 2020, 02:50:11 PM IST

RGV

సంచలనాలాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ లాక్ డౌన్ సమయంలో కూడా తన సినిమాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడని చెప్పాలి. గత కొంత కాలం నుంచి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలను ఎక్కువగా తీస్తున్నాడు. ఇటీవలే పవర్ స్టార్ అనే సినిమాను తీసి కలకలం రేపి ఇప్పుడు మళ్ళీ “అల్లు” అనే మరో సినిమాను తెరకెక్కిస్తున్నానని కలకలం రేపారు.

అయితే రామ్ గోపాల్ వర్మ తాను ఫిక్షనల్ గా సినిమాలు తీస్తాను అని చెప్పినా అతను టార్గెట్ చేసింది మెగా ఫ్యామిలీనే అని అందరికీ తెలిసిందే. కానీ అందులో కూడా అతనికి ఒక పాజిటివిటి ఉందని అనిపిస్తుంది. అది ఇటీవలే “పవర్ స్టార్” చిత్రం తో నిరోపితం అయ్యింది. ఈ సినిమా ఏదోలా ఉంటుంది అని చాలా మంది అనుకుంటే వారందరికే ఎసరు పెట్టినట్టుగా చూపించాడు.

దానితో తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే అని ముద్ర వేసుకున్నాడు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో కానీ ఇప్పుడు తెరకెక్కిస్తున్న “అల్లు” అనే సినిమాను కూడా తీసి ఏకంగా బడా నిర్మాతనే టార్గెట్ చేసారని చెప్పాలి. మెగాస్టార్ చిరు పెట్టిన రాజకీయ పార్టీ విఫలానికి అల్లునే ప్రధాన కారణం అని ఇప్పటికీ అనేక వదంతులు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ వారంతా తర్వాత కలిసే ఉన్నారు.

ఇదిలా ఉండగా వర్మ పెట్టిన ట్వీట్ లో మెగా ఫ్యామిలీ పై సాఫ్ట్ కార్నర్ కనపడుతుంది. “తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటర్జీ తో ప్లాన్ ల అల్లుడు లో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి “అల్లు”డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడు.” అని ట్వీట్ చేసాడు. ఇవన్నీఈ చూస్తుంటే అతను మెగా ఫామిలీకి వీరాభిమాని గానో లేక సానుభూతిపరుడు గానో చిత్రీకరించుకోవాలని అనుకుంటున్నాడనిపిస్తుంది.