వర్మ క్రియేటివిటీ కి ఇది అడ్డు పడుతుందా..!

Friday, July 31st, 2020, 01:48:17 AM IST


కరోనా వైరస్ మహమ్మారి చెలరేగుతున్న సమయం లో కూడా తను టైమ్ వేస్ట్ చేయకుండా ఒక దాని తర్వాత మరొక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. క్లైమాక్స్ చిత్రం తో మొదలు పెట్టిన వర్మ, పవర్ స్టార్ వరకు వచ్చేసింది. అయితే ట్రైలర్, పోస్టర్ లతో నే పబ్లిసిటీ రాబట్టుకున్న వర్మ, కలెక్షనలలో మాత్రం వెనక బడినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు.

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ప్రతి చిత్రం నిడివి 20 నుండి 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ దియేటర్ లో విడుదల అయిన పవర్ స్టార్ చిత్రం నిడివి కూడా అంతే. పబ్లిసిటీ ఎలా ఉన్నా, 20-30 నిమిషాల కోసం ప్రేక్షకులు 100 నుండి 150 రూపాయలు చెల్లించాలా అంటూ ప్రశ్నించుకుంటూ పైరసీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కువగా పైరసీ ద్వారా రామ్ గోపాల్ వర్మ కి నష్టం జరుగుతుంది అని తెలుస్తోంది. వర్మ క్రియేటివిటీ కి పైరసీ అడ్డుకట్ట లా మారింది అని చెప్పాలి. అంతేకాక పవర్ స్టార్ చిత్రం లో అంతగా విషయం లేకపోవడం తో పైరసీ లోనే చూస్తున్నట్లు తెలుస్తోంది.