పవన్ సినిమా టైటిల్ మళ్ళీ మారిందా.?

Friday, February 14th, 2020, 12:05:22 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాక రాక మళ్ళీ సినిమాల్లోకి వస్తుండడంతో పవన్ అభిమానుల్లో ఒక రేంజ్ లో అంచనాలు ఏర్పడిపోయాయి.ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వాటిని మంచి వైరల్ చేస్తున్నారు.అయితే పవన్ ఈ ప్రాజెక్ట్ మొదలు కానప్పటి నుంచీ చిన్న చిన్న హింట్స్ ఇస్తూ నిర్మాత దిల్ రాజు పవన్ అభిమానులను కాస్త ఆశ్చర్యానికి గురి చేసారు.ఆ సమయంలోనే ఈ చిత్రానికి టైటిల్ గా “లాయర్ సాబ్” ను అనుకున్నారని పలు వార్తలు కూడా వైరల్ అయ్యాయి.

కానీ వాటన్నిటికీ తెర దించుతూ ఫిలిమ్ ఛాంబర్ లో దిల్ రాజు “వకీల్ సాబ్” అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారని టైటిల్ ఖరారు అయ్యిపోయింది.కానీ ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో మరో వార్త సోషల్ మీడియాలో బయటకొచ్చింది.దిల్ రాజు ఎందుకో మళ్ళీ వకీల్ సాబ్ టైటిల్ ను లాయర్ సాబ్ గానే రీ రిజిస్టర్ చేయించారని వార్తలు వినిపిస్తున్నాయి.మరి దీనిపై ఒక అధికారిక ప్రకటన వస్తేనే కానీ ఒక క్లారిటీ వచ్చేలా లేదు.