కొరటాల శివ నిర్ణయం వారిని అప్ సెట్ కి గురి చేసిందా!?

Saturday, August 8th, 2020, 02:48:58 AM IST


తెలుగు సినీ పరిశ్రమ లో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు కొరటాల శివ. రాజమౌళి తరహాలో ప్రతి సినిమా ను బ్లాక్ బస్టర్ గా మలిచే దర్శకుడు కొరటాల. సందేశాత్మక, సామాజిక స్పృహ గల అంశాలను చూపిస్తూనే, కమర్షియల్ హంగులతో సరికొత్త గా చూపించే సత్తా ఉన్న డైరెక్టర్ కొరటాల శివ. అయితే కొరటాల శివ తో భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సంస్థ మైత్రి మూవీ మేకర్స్. అయితే కొరటాల శివ తో తన తదుపరి చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ కొరటాల నిర్ణయం వారిని అప్ సెట్ కి గురి చేసింది అట.

ఆచార్య చిత్రం అనంతరం కొరటాల అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నారు. అయితే గీతా ఆర్ట్స్ తో సినిమా చేయడం పట్ల వారు కాస్త అసహనం గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత అయిన తమతో కొరటాల తప్పక సినిమాలు చేస్తారు అనే నమ్మకం తో ఉందట మైత్రి మూవీ మేకర్స్. కొరటాల శివ ఆచార్య చిత్రం అనంతరం అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నారు. ఈ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ ను కొరటాల శివ ఎలా చూపించబోతున్నరో అని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.