డోంట్ మిస్: మహేష్ బాబు కి ఊహించని షాక్ తగిలిందా?

Sunday, February 23rd, 2020, 04:48:10 PM IST

మహేష్ బాబు బ్లాక్ బస్టర్ చిత్రాలు చేస్తూ అభిమానులని, ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. మహర్షి చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి తాజాగా తీసుకొచ్చిన కథలో దమ్ము లేకపోవడం తో మహేష్ బాబు రిజెక్ట్ చేసినట్లు ఫిలిం నగర్లో పుకార్లు వస్తున్నాయి. అయితే మహేష్ కథ రిజెక్ట్ చేయడం తో నిర్మాత దిల్ రాజు కూడా అప్సెట్ అయ్యాడని తెలుస్తుంది. సినిమా ని జులై లో మొదలు పెట్టి, వచ్చే ఏడాది కి విడుదల చేయాలనీ మహేష్ భావించాడు. కానీ ఇపుడు వచ్చిన ఈ గ్యాప్ కి ఏం చేయాలో అర్ధం కానీ పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే గతంలో మహేష్ కి కథ వినిపించిన పరశురామ్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా దర్శకులు తమ ప్రాజెక్టులతో బిజీ గా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ సమయం లో మహేష్ ఎవరికీ ఛాన్స్ ఇస్తారు, ఎవరిని ఓకే చేస్తారనేది హాట్ టాపిక్ అయింది. ఇప్పటివరకు ఏడాదికి ఒక సినిమా చేస్తున్న మహేష్ ఈ సడెన్ గ్యాప్ తో కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది. సరిలేరు నీకెవ్వరూ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ ఎఫ్3 లో నటించనున్నారు.