కొరటాల, అల్లు అర్జున్ తో సినిమా ఫిక్స్ చేసేశాడా!?

Friday, July 31st, 2020, 12:20:51 AM IST


ఊహించని కాంబినేషన్ టాలీవుడ్ లో వర్క్ అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తోంది అంటూ ఫిల్మ్ నగర్ లో వార్త చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం రేపు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12:55 గంటలకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప చిత్రం షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ కారణం గా వాయిదా పడిన ఈ చిత్రం, త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే కొరటాల శివ సైతం ఆచార్య చిత్రం కోసం పని చేస్తున్నారు. అయితే ఈ చిత్రం అనంతరం వీరి సినిమా మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది గంటల వేచి చూడల్సిందే.