బన్నీకు ఈ విషయం ఇంకా తెలీదా.?

Tuesday, March 24th, 2020, 06:14:04 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు. షూటింగ్స్ అన్ని బంద్ కావడంతో తమ కుటుంబంతోనే గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తమ కుటుంబానికి చెందిన పెద్ద మెగాస్టార్ చిరంజీవి అంటే బన్నీ ప్రాణం ఇస్తాడు. తమకి పూల దారి పరిచిన మెగాస్టార్ ను ఒక్క మాట అన్నా కానీ తక్కువ చేసినా కానీ తానే మొదటగా స్పందిస్తారు.

ఎక్కడైనా సరే చిరు కోసం మాట్లాడకుండా ఉండని బన్నీ ఇప్పుడు మెగాస్టార్ విషయంలో ఇంకా మౌనంగా ఉండడం ఆశ్చర్యకరం. మెగాస్టార్ చిరంజీవి ఈరోజే తన మొట్టమొదటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అరంగేట్రం చేసారు. ఇన్స్టాగ్రామ్ లో ఖాతా ఓపెన్ చేసిన మెగాస్టార్ కు కేవలం గంటల్లోనే లక్షలాది మంది ఫాలోవర్స్ వచ్చేసారు.

దీనితో మొత్తం మెగా కుటుంబం అంతా మెగాస్టార్ కు గ్రాండ్ వెల్కమ్ చెపుతూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆనందం వ్యక్తం చేసారు. కానీ బన్నీ మాత్రం ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా వెయ్యలేదు. మరి ఈ విషయం బన్నీకు ఇంకా తెలీకుండా ఉంటుందా లేక ఎప్పటిలానే కాస్త లేట్ గా పోస్ట్ చేస్తారా అన్నది చూడాలి.