“కేజీఎఫ్ చాప్టర్ 2” లో ప్రకాష్ రాజ్ పాత్ర పై ఆసక్తికర చర్చ!

Wednesday, August 26th, 2020, 05:20:14 PM IST

సౌత్ ఇండియా ఇండస్ట్రీ ని షేక్ చేసిన కేజీఎఫ్ చాప్టర్ 1 కి కొనసాగింపు గా వస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్, నేటి నుండి మళ్లీ ప్రారంభం అయింది. ఈ చిత్రం పై ఇప్పటికే సర్వత్రా చర్చ జరుగుతుండగా, ప్రకాష్ రాజ్ పాత్ర అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్ ఎటువంటి పాత్ర చేస్తున్నారు అనే దాని పై ఆసక్తి కర చర్చ మొదలు అయింది. మొదటి భాగం లో కీలక పాత్ర పోషించిన అనంత నాగ్ పాత్ర లో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు అని కొందరు చెబుతుండగా, మరి కొందరు మాత్రం ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు అని అంటున్నారు. రాకీ భాయ్ కి లేదా విలన్ పాత్ర పోషిస్తున్న అధీరా వద్ద పని చేసే లాయర్ గా ప్రకాష్ రాజ్ కనిపించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.