పుష్పరాజ్ పై పెరుగుతున్న భారీ అంచనాలు

Wednesday, April 7th, 2021, 09:48:00 AM IST

అల్లు అర్జున్ హీరోగా, రష్మీక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా ఆగస్ట్ 13 వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ చిత్రం లో అల్లు అర్జున్ గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. ఊర మాస్ లుక్ లో అల్లు అర్జున్ అలరించనున్నారు. అయితే సుకుమార్ ఇప్పటి వరకూ కూడా అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ గా చూపించారు. మాస్ లుక్ తో ఈ సినిమా లో స్టైలిష్ స్టార్ ను మర్చిపోవచ్చు అంటూ ఇటీవల సుకుమార్ సైతం తెలిపారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన స్మాల్ వీడియో నేడు విడుదల కానుంది.

అల్లు అర్జున్ పుష్ప లో ఎలా ఉంటాడు అనే దానిపై పోస్టర్ ను చూస్తే ఒక క్లారిటీ వచ్చింది. ఏ తరహాలో స్క్రీన్ పై అలరించనున్నాడు అనేది నేడు సాయంత్రం 6:12 గంటలకు తెలియనుంది. అయితే అల్లు అర్జున్ పుట్టిన రోజు పురస్కరించుకొని చిత్ర యూనిట్ ముందుగానే టీజర్ ను విడుదల చేయనుంది. అయితే ఈ విషయం తెలియడం తో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షల తో పాటుగా, ఇంట్రడ్యూసింగ్ పుష్ప అనే హ్యాష్ ట్యాగ్ ను సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్, సుకుమార్, అల్లు అర్జున్ కాంబో లో సినిమా కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి పుష్ప ఎలా ఉండబోతున్నాడు అనేది తెలియాలంటే ఇంకొద్ది గంటల్లో తేలనుంది.