మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో నిర్మించిన ఉప్పెన సినిమా ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి సినిమాతోనే వైష్ణవ్‌తేజ్ ఓ సరికొత్త రికార్డ్ సొంతం చేసుకున్నారు. ప్రేక్షకుల నుంచి సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను సాధించింది.
అయితే తొలి రోజు ఈ సినిమా ఏకంగా 10.42 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. అయితే ఓ హీరో తొలి సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే తొలిసారని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా నైజాంలో రూ.3.08 కోట్లు, వైజాగ్‌లో రూ.1.43 కోట్లు, సీడెడ్ రూ.1.35 కోట్లు, ఈస్ట్ రూ.98లక్షలు, వెస్ట్ రూ.81 లక్షలు, కృష్ణ రూ.62 లక్షలు, గుంటూరు రూ.65 లక్షలు, నెల్లూరు రూ.35 లక్షలు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.9.30 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఇక ఓవర్సీస్లో 34 లక్షలు, కర్ణాటకలో రూ.52 లక్షలు, తమిళనాడులో రూ.16 లక్షలు, రెస్టాఫ్ ఇండియా 10 లక్షలు వసూళ్లతో మొత్తంగా రూ.10.42 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఏదేమైనా వైష్ణవ్‌తేజ్‌కి ఈ సినిమా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందనే చెప్పాలి.