రవితేజ ‘క్రాక్’ మూవీ ఎంజాయ్ చేశా.. రామ్‌చరణ్ ట్వీట్‌..!

Wednesday, January 13th, 2021, 11:15:45 PM IST

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా క్రాక్ ఈ నెల 9న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల కాస్త ఆలస్యం అయినా మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమాపై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రశంసలు కురిపించారు.

క్రాక్ సినిమాను తాను చాలా బాగా ఎంజాయ్ చేశానని, నా అభిమాన నటుడు రవితేజ ప్రస్తుతం టాప్‌ ఫాంలో ఉన్నారని, హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని, సముద్రఖని, వరలక్ష్మీశరత్‌ కుమార్‌ తమ నటనతో అదరగొట్టారని, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని, డైరెక్టర్ గోపిచంద్ ఈ మూవీని తెరకెక్కించిన విధానం అద్భుతం అని ఈ సినిమా టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని రామ్‌చరణ్ ట్వీట్ చేశాడు. అయితే రామ్ చరణ్ ట్వీట్‌పై స్పందించిన తమన్‌, మూవీ దర్శకుడు గోపిచంద్‌ మలినేని చరణ్‌కి ధన్యవాదాలు తెలిపారు.