మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్..!

Wednesday, November 11th, 2020, 02:02:19 AM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరో సరికొత్త రికార్డ్ నమోదు చేసుకున్నాడు. ట్విట్టర్ ఖాతాలో అతి తక్కువ సమయంలో 1 మిలియన్ ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం 233 రోజులలోనే రామ్ చరణ్ ఈ ఘనతను సాధించడం మరో విశేషం. టాలీవుడ్‌లో మరే హీరో కూడా ఇంత తక్కువ సమయంలో ఈ ఘనతను అందుకోలేదు. ఇక ఈ ఏడాది మార్చ్‌లో రామ్ చరణ్ ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేశాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ ఋఋఋ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతు తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. భారీ బడ్జెట్ ఈ సినిమాను దానయ్య నిర్మిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మళ్ళీ ప్రారంభమయ్యింది.