సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయలు ప్రకటించిన ప్రభాస్..!

Wednesday, October 21st, 2020, 12:05:53 AM IST


హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలమయ్యింది. నదులు, చెరువులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలలోని చాల కాలనీలు నీట మునిగాయి. అయితే వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు కూడా తమవంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళాలు అందిస్తున్నారు.

అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తెలంగాణ సీఎం సహాయనిధికి తన వంతు సాయంగా కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. అయితే ఇప్పటికే మెగస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, మ‌హేష్ బాబు కోటి రూపాయ‌లు, బాలకృష్ణ 50 లక్షలు, నాగార్జున 50 ల‌క్ష‌లు, ఎన్టీఆర్ 50 ల‌క్ష‌లు, రామ్ పోతినేని 25 లక్షలు, విజ‌య్ దేవ‌ర‌కొండ 10 ల‌క్ష‌లు, హారికా హాసిని క్రియేషన్స్ 10 లక్షలు, త్రివిక్రమ్ 10 లక్షలు, హ‌రీష్ శంక‌ర్, అనిల్ రావిపూడి చెరో 5 ల‌క్ష‌లు సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు.