కార్తికేయ 2 షూటింగ్‌లో ప్రమాదం.. హీరో నిఖిల్‌కు గాయాలు..!

Thursday, March 11th, 2021, 12:26:46 AM IST


టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్‌ గాయాలపాలయ్యాడు. కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న కార్తికేయ 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం గుజరాత్‌లో జరుగుతోంది. అందులో భాగంగా అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా హీరో నిఖిల్‌ కాలుకి గాయం అయినట్టు తెలుస్తుంది. దీంతో చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ ఆపివేసింది. అయితే గాయం నుంచి కోలుకునే వరకు యాక్షన్ సీన్స్‌కి నిఖిల్ దూరంగా ఉండబోతున్నాడు.

అయితే హీరో నిఖిల్ ఆరోగ్యం విషయంలో అభిమానులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం నిఖిల్ ఆరోగ్యం బాగానే ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు చందు మెుండేటి దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.