ఆ మూవీ రీమేక్‌లో నటించేందుకు యాక్షన్ కింగ్ ఇంట్రెస్ట్..!

Sunday, October 18th, 2020, 08:56:43 PM IST

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీమేక్‌లు పెరిగిపోతున్నాయి. సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా చాలా మంది రీమేక్ సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా ఓ మలయాళ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మాలీవుడ్‌లో రతీష్‌ బాలకృష్ణన్‌ పొదువల్‌ తెరకెక్కించిన ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారట.

అయితే సైన్స్‌ ఫిక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25లో సూరజ్ వెంజారమోద్‌, సౌబిన్ సాహిర్, కెండీ జిర్దో, సైజు కిరు వంటి వారు కీలక పాత్రలలో కనిపించారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా మలయాళంలో మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా రీమేక్‌లో నటించేందుకు విలక్షణ నటుడు, యాక్షన్ కింగ్ మోహన్ బాబు నటించేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు సమాచారం. అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.