షూటింగ్ స్పాట్‌లో కనిపించిన మహేశ్ బాబు.. ఎందుకంటే?

Wednesday, September 9th, 2020, 03:00:08 PM IST

Maheshbabu_adshoot

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉండడంతో దాదాపుగా ఆరు నెలలకు పైగా సినిమా షూటింగ్‌లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే పరిమిత సంఖ్యలో నటీ నటులు, సిబ్బందితో షూటింగ్‌లు జరుపుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా సినిమా షూటింగ్‌లు ప్రారంభమవుతున్నాయి.

అయితే తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు షూటింగ్ స్పాట్‌లో కనిపించారు. అయితే ఇది సినిమా షూటింగ్ కాదండోయ్ ఓ యాడ్ షూట్ కోసం ఆయన షూటింగ్ స్పాట్‌కి వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఈ రోజు, రేపు ఆ యాడ్ షూట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేశ్ బాబు గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.