ప్రభాస్ ఆదిపురుష్‌లో లక్ష్మణుడుగా సౌత్ హీరో.. నిజమేనా?

Tuesday, September 22nd, 2020, 12:41:57 AM IST

adi-purush-Prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరెవరు ఏ పాత్రలలో నటిస్తారనేది మాత్రం ఎంతకు తేలడం లేదు.

అయితే ఇప్పటికే రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ పేర్లను నిర్వాహకులు కన్‌ఫార్మ్ చేశారు. ఇందులో సీత పాత్ర కోసం చాలా మంది పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఎవరూ ఖరారు కాలేదు. ఇక సినిమాలో లక్ష్మణుడి పాత్రకి సౌత్ హీరో అథర్వ మురళిని తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అతనితో చర్చలు జరిపారని దానికి అతను కూడా ఒకే చెప్పినట్టు సమాచారం. అయితే దీనిపై త్వరలో అధికార ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తుంది.