ప్రభాస్ “ఆదిపురుష్”‌లో లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నది ఎవరంటే?

Tuesday, December 8th, 2020, 02:13:57 AM IST

adi-purush-Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతగా కృతి సనోన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా లక్ష్మణుడి పాత్రలో నటించేందుకు తమిళ్ హీరో అథర్వాను ఎంపిక చేసినట్టు సమాచారం. అథర్వ వరుణ్ గజ్జలగొండ గణేష్ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.