శ్రేయాస్ అయ్యర్ ఫెవరెట్ టాలీవుడ్ హీరో ఆ ఒకే ఒక్కడు!

Wednesday, March 25th, 2020, 08:00:09 PM IST

భారత్ యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక ఓపెనర్ బ్యాట్సమెన్ గా మాత్రమే కాకుండా ఏ స్థానంలో దింపినా సరే ప్రత్యర్ధ టీమ్ కు చుక్కలు చూపించగలడు.

మహారాష్ట్రకు చెందిన ఈ డైనమిక్ ఆటగాడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన ఫాలోవర్స్ తో ఒక చాట్ సెషన్ పెట్టగా అందులో మన వాళ్ళు శ్రేయాస్ ను తనకు నచ్చిన ఫేవరేట్ దక్షిణాది హీరో ఎవరు అని అడగ్గా శ్రేయాస్ సింగిల్ వర్డ్ తో ముగించేశారు.

అతనే మరెవరో కాదు మన తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలితో ఖండాంతరాలు దాటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఒక్క తెలుగు నుంచే కాకుండా మొత్తం సౌత్ ఇండియన్ హీరోల్లో ప్రభాస్ ఒక్కడే అనడంతో ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.