ఇంటర్వ్యూలతోనే శ్రీరెడ్డి కి కరెక్ట్ మొగుడు తగిలాడా.?

Saturday, February 22nd, 2020, 07:30:01 PM IST

మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ రెడ్డి పేరు తెలీని వారు ఎవరూ ఉండరు.ఎక్కడో ఒక ఇంటర్వ్యూతో మొదట వెలుగులోకి అదే ఇంటర్వ్యూల ద్వారా ఒక్కసారిగా సంచలనం అయ్యిపోయింది.అప్పటి నుంచి ఈమె టాలీవుడ్ లో కెలకని వ్యక్తి లేడు.అలా ఈమె రచ్చ హద్దులు దాటిపోయింది,అలా దాటి ఎక్కడెక్కడికో పోయింది.

దీనితో ఈమెను మొదట ప్రతిఘటించిన వారంతా ఇలాంటి వారితో వాదన చేస్తే మనకే సిగ్గు చేటని వదిలేసారు.దీనితో మన దగ్గర న్యూస్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూస్ ఆపేసిన ఇంకా పలు యూట్యూబ్ ఛానెల్స్ నుంచి అలాగే ఆమె సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పచ్చి బూతులతో ఇంకా విరుచుకుపడుతూ మరింత మందిని కెలుకుతూ పోతుంది.

అయితే ఇప్పుడు ఈమెకు కరెక్ట్ మొగుడు దొరికాడా అంటే సోషల్ మీడియాలో టాక్ అదే వినిపిస్తుంది.శ్రీరెడ్డి లానే యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ద్వారా కొంతమంది వ్యక్తుల మీద సంచలన కామెంట్స్ చేసిన టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కు శ్రీరెడ్డికు ఇప్పుడు రసవత్తరమైన యుద్ధం జరుగుతుంది.

దీనితో ఇప్పుడు శ్రీరెడ్డి హేటర్స్ అంతా రాకేష్ మాస్టర్ కు సపోర్ట్ చేస్తున్నారు.ఆయన్ను ఉద్దేశించి శ్రీముఖి చేస్తున్న ప్రతీ కామెంట్స్ కు ఆయన దిమ్మ తిరిగే సమాధానాన్ని శ్రీరెడ్డి స్టైల్ లోనే సమాధానం ఇస్తుండడంతో శ్రీరెడ్డికి సరైన వ్యక్తి తగిలాడని అంటున్నారు.