పవన్ వరుస సినిమాలు ఓకే… మరి ఫలితాలు ఇలా వస్తే ఎలా?

Sunday, February 23rd, 2020, 08:39:03 PM IST

పవన్ కళ్యాణ్ వరుసగా పింక్ రీమేక్ తో పాటుగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా మరియు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లలో పాల్గొనడం బాగానే ఉన్నా, ఫలితాల పట్ల నిర్మాతలు కాస్త ఆచి తూచి అడుగేస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ చివరి సినిమా అజ్ఞాతవాసి బాక్సఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుందో అందరికి తెలిసిన విషయమే.

పవన్ కేవలం అజ్ఞాతవాసి మాత్రమే కాదు, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు లాంటి చిత్రాలను కూడా థియేటర్ల లోకి వదిలాడు. ఈ చిత్రాలు బయ్యర్లకు చేదు అనుభవాల్ని మిగిల్చింది. పూర్తీ సమయాన్ని సినిమాల్లో పెట్టినప్పుడే పవన్ అంతగా రాణించలేదు. కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్ తో సినిమాని గట్టికించలేరు. రాజకీయాల్లో ఉంటూనే పవన్ తూతూ మంత్రంగా సినిమా ని పూర్తీ చేస్తున్నట్లు పుకార్లు కూడా వస్తున్నాయి. మరి ఈ సినిమాలు కూడా గత చిత్రాల ఫలితాలు నమోదు చేసుకుంటే ఎంతోమంది బలికాక తప్పదనే విషయం పవన్ గుర్తించాలి.